కోహ్లీ, రోహిత్‌లపై స్టార్‌స్పోర్ట్స్ ప్రోమో.. ఓ లుక్కేయండి..!

  • కోహ్లీ, రోహిత్‌లను లెజెండ్స్ అంటూ పొగుడుతూ ప్రోమో వ‌దిలిన స్టార్‌స్పోర్ట్స్
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ప్రోమో
  • 'సింప్లీ సూప‌ర్బ్' అంటూ నెటిజ‌న్ల‌ కామెంట్
ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నేప‌థ్యంలో టీమిండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మల‌పై స్టార్‌స్పోర్ట్స్ ప్రోమో విడుద‌ల చేసింది. వీరిద్ద‌రినీ లెజెండ్స్ అంటూ ప్రశంసిస్తూ వ‌దిలిన ప్రోమో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ 'సింప్లీ సూప‌ర్బ్' అంటూ కామెంట్ చేస్తున్నారు. 

ఇక జూన్‌లో జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఇప్ప‌టికే బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన విష‌యం తెసిందే. అయితే, సెల‌క్ట‌ర్లు మ్యాచ్ విన్న‌ర్ల‌ను ఎంపిక చేయ‌లేక‌పోయార‌ని కొంద‌రు మాజీ క్రికెట‌ర్లు, క్రికెట్ అన‌లిస్టులు పెద‌వివిరుస్తున్నారు. ముఖ్యంగా రింకూ సింగ్‌, న‌ట‌రాజ‌న్‌ను జ‌ట్టులో తీసుకునే ఉంటే బాగుండేద‌ని చాలామంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

  జూన్ 2వ తేదీ నుంచి అమెరికా, వెస్టిండీస్‌లలో వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 20 జ‌ట్లు, 5 గ్రూపులుగా విడిపోయి పోటీ ప‌డ‌నున్నాయి. గ్రూప్‌-ఏలో భార‌త్‌తో పాటు కెన‌డా, అమెరికా, ఐర్లాండ్‌, పాకిస్థాన్ ఉన్నాయి. టీమిండియా త‌న తొలి మ్యాచ్‌ను న్యూయార్క్ వేదిక‌గా జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడ‌నుంది. ఆ త‌ర్వాత జూన్ 9న భార‌త్‌-పాక్ మ‌ధ్య‌ హైఓల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అలాగే 12న అమెరికాతో, 15న కెన‌డాతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.


More Telugu News