మరో 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపిన గూగుల్

  • ఇటీవల కొన్ని టీంల ఉద్యోగులను ఇంటికి పంపిన గూగుల్
  • రెండు రోజుల వ్యవధిలోనే మరికొందరిపై వేటు
  • ఇండియా, మెక్సికోలోనూ ఉద్యోగుల తొలగింపులు ఉండే అవకాశం
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తన కోర్ టీం నుంచి 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి సంబంధించి ఆదాయ నివేదికలో ఎదురు దెబ్బ తగిలిన అనంతరం గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇండియా, మెక్సికోలోనూ కొందరు ఉద్యోగులను ఇంటికి పంపేందుకు గూగుల్ సిద్ధమైనట్టు ‘సీఎన్‌బీసీ’ నివేదించింది. 

గూగుల్ ఇటీవలే తమ ఫ్లట్టర్, డార్ట్, పైథాన్ టీం ఉద్యోగులను తొలగించింది. అది జరిగిన రెండు రోజులకే ఇప్పుడు మరో 200 మందిని ఇంటికి పంపింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో కనీసం 50 మంది కాలిఫోర్నియా సన్నీవేల్‌ కార్యాలయంలోని ఇంజినీరింగ్ విభాగంలోని వారే. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి గూగుల్ డెవలపర్ ఎకోసిస్టం వైస్ ప్రెసిడెంట్ ఆసిం హుస్సేన్ ప్రకటించారు.


More Telugu News