‘నవ సందేహాల’ పేరుతో జగన్‌కు మరో లేఖ రాసిన షర్మిల
- నవ సందేహాల పేరుతో షర్మిల రెండో లేఖ
- 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మీ హామీ ఏమయిందన్న షర్మిల
- జాబు రావాలంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా అని ప్రశ్న
తన సోదరుడు, సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల మరో బహిరంగ లేఖను రాశారు. 'నవ సందేహాలు' పేరుతో ఇప్పటికే షర్మిల ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరో లేఖను సంధించారు. లేఖలో తాను లేవనెత్తిన తొమ్మిది ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
షర్మిల నవ సందేహాలు ఇవే:
షర్మిల నవ సందేహాలు ఇవే:
- 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు. మీరు చేసిందేమిటి?
- 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మీ హామీ ఏమయింది?
- ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదు?
- నిరుద్యోగులు 7.7 శాతం పెరగడం మీ ప్రభుత్వ వైఫల్యం కాదా?
- 23 వేలతో మెగా డీఎస్సీ అన్నారు. 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు?
- యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదు?
- గ్రూప్-2 కింద ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు భర్తీ చేయలేదు?
- యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు?
- జాబు రావాలంటే మీ పాలన పోవాలి అని అంగీకరిస్తారా?