జిమ్ లో కసరత్తులు చేస్తూ యువకుడి మృతి.. వీడియో ఇదిగో!
- వారణాసిలోని ఓ జిమ్ లో ఘటన
- వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటు
- పదేళ్లుగా రెగ్యులర్ గా వ్యాయామం చేస్తున్న యువకుడు
- ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసిన వైనం
జిమ్ లో వ్యాయామం చేస్తూ ఓ యువకుడు కుప్పకూలాడు.. తలపోటుగా ఉందని చెప్పడంతో అక్కడున్న వారు సపర్యలు చేస్తుండగానే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువకుడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో చోటుచేసుకుందీ విషాదం.
నగరానికి చెందిన దీపక్ గుప్తా (32) రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుండేవాడు. పదేళ్లుగా క్రమం తప్పకుండా జిమ్ కు వెళుతుండేవాడు. ఆరోగ్యంపై స్పృహ ఎక్కువ.. సిటీతో పాటు చుట్టుపక్కల జరిగే ఫిట్ నెస్ కాంపిటీషన్లలో చురుగ్గా పాల్గొనేవాడు. రోజూలాగే గురువారం ఉదయం కూడా జిమ్ కు వెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడ్డాడు. తలపట్టుకుని కూర్చున్న కాసేపటికి కుప్పకూలాడు. నేలమీద పడ్డ దీపక్ ను అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగిస్తుండగా దీపక్ నిలువెళ్లా వణికిపోతుండడం గమనించినట్లు చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. దీపక్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణం పోయిందని తెలిపారు. జిమ్ లోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డు కాగా.. ప్రస్తుతం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.