ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే..!
- ఈ నెల 7, 8వ తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ
- షెడ్యూల్ విడుదల చేసిన బీజేపీ
- 7న పురందేశ్వరి తరఫున వేమగిరి సభలో పాల్గొననున్న ప్రధాని
- 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీలేరు సభకు హాజరు
ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్‌డీఏ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7, 8వ తేదీల్లో ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు బీజేపీ బుధవారం ప్రధాని ఎన్నికల ప్రచార పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి తరఫున వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో ప్రధాని పాల్గొంటారు.
ఇక 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీలేరు సభకు హాజరవుతారు. రాత్రి 7 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు.