కేసీఆర్‌కు ఈసీ షాక్... ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

  • ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
  • కాంగ్రెస్ నేతలపై అనుచిత వ్యాఖ్యల మీద ఈసీ సీరియస్
  • ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ప్రచారంపై నిషేధం
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది. కొన్నిరోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సీరియస్ అయింది. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు అంటే ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఆయన ప్రచారంపై నిషేధం వర్తిస్తుంది.


More Telugu News