అమేథి, రాయ్‌బరేలిలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై స్పందించిన మేనకాగాంధీ
- నామినేషన్లకు రెండు రోజులు మాత్రమే గడువు ఉందన్న మేనకా గాంధీ
- ఆ పార్టీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుందో స్పష్టత లేదని వ్యాఖ్య
- 24 గంటల్లో అభ్యర్థులను ప్రకటిస్తామన్న కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్
నామినేషన్లకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉందని, అమేథి, రాయ్‌బరేలి నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుందో ఇంకా స్పష్టత లేదని సుల్తాన్‌పూర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అభ్యర్థి మేనకా గాంధీ అన్నారు. బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎల్లుండితో ఈ నియోజకవర్గాలకు నామినేషన్ గడువు ముగియనుందని తెలిపారు. వారు (కాంగ్రెస్) అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారోనని వ్యాఖ్యానించారు.
24 గంటల్లో ప్రకటిస్తాం: జైరాం రమేశ్
ఇదిలావుండగా, లోక్ సభ ఎన్నికలకు అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాలకు అభ్యర్థులను 24 గంటల్లో ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అంతకుముందు తెలిపారు. అమేథి, రాయ్‌బరేలీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ పార్టీ అధ్యక్షుడికి అధికారం ఇచ్చిందన్నారు. మరో 24-30 గంటల్లో, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలిపారు. అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండాలన్నారు.