రష్యా దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం

  • ఉక్రెయిన్ లోని ఒడెస్సా నగరంలో ఉన్న హ్యారీపోటర్ కోట
  • ఇసికందర్ క్షిపణితో రష్యా దాడి
  • దాడిలో ఐదుగురి దుర్మరణం
ఉక్రెయిన్ పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో హ్యారీపోటర్ కోట ధ్వంసమయింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో ఈ కోట ఉంది. ఎంతో ప్రసిద్ది చెందిన ఈ కోట... అత్యంత సుందర భవనాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇసికందర్ క్షిపణికి క్లస్టర్ వార్ హెడ్ ను అమర్చి కోటపైకి రష్యా ప్రయోగించినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా... 30 మంది గాయపడినట్టు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. 

క్షిపణి ఢీకొన్న చోట నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు శకలాలు పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి కారణంగా చుట్టుపక్కల ఉన్న మరో 20 భవనాలు కూడా దెబ్బతిన్నాయి. దాడికి సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ విడుదల చేశారు. ఇందులో ఓ సుందర భవనం అగ్నికీలలకు ఆహుతి అవుతున్న చిత్రం కూడా ఉంది. మరోవైపు ఖార్కీవ్ నగరంలోని ఓ రైల్వే లైన్ పై రష్యా గైడెడ్ బాంబ్ తో దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఉక్రెయిన్ లో రెండో పెద్ద నగరం ఖార్కీవ్.



More Telugu News