లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
- ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్ లో 3 వేల అశ్లీల వీడియోలు
- తాను లైంగిక దాడులకు పాల్పడిన మహిళల వీడియోలను రికార్డ్ చేసిన ప్రజ్వల్
- వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ పదే పదే అత్యాచారాలు!
- వీడియోలు బయటికి రాగానే జర్మనీ పారిపోయినట్టు కథనాలు
- నిజం త్వరలోనే తెలుస్తుందంటూ ట్వీట్ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ
కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై తీవ్రస్థాయిలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తెలిసిందే. ఆయన పెన్ డ్రైవ్ లో 3 వేల అశ్లీల వీడియోలు ఉండడం, అవన్నీ ఆయన లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళల వీడియోలే కావడంతో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఈ వీడియోలు బయటికి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని విడిచి జర్మనీ పారిపోయినట్టు కథనాలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.
కాగా, తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం పట్ల ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారిగా స్పందించారు. ప్రస్తుతం తాను బెంగళూరులో లేనందువల్ల సీఐడీ విచారణకు హాజరు కాలేకపోతున్నానని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇదే విషయాన్ని తన న్యాయవాది ద్వారా సీఐడీ అధికారులకు తెలియజేశానని ప్రజ్వల్ పేర్కొన్నారు. త్వరలోనే నిజం గెలుస్తుందని స్పష్టం చేశారు.
ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ మనవడు అని తెలిసిందే. ప్రజ్వల్ రేవణ్ణపైనే కాదు, ఆయన తండ్రి హెచ్ డీ రేవణ్ణపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మొత్తమ్మీద కర్ణాటక రాజకీయాల్లో ఈ అంశం పెను కుదుపులకు కారణమైంది.