బీజేపీలో చేరిన ప్రముఖ నటి రూపాగంగూలీ
- కోల్ కతాలో తావ్డే సమక్షంలో బీజేపీలో చేరిన రూపాగంగూలీ
- మోదీ పనితీరు తనను ఆకర్షించిందన్న రూప
- పార్టీ ఏ పని అప్పగించినా చేస్తానని వ్యాఖ్య
ప్రముఖ బుల్లితెర నటి రూపాగంగూలీ బీజేపీలో చేరారు. 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్', 'అనుపమ' సీరియల్స్ ద్వారా ఆమె బాగా పాప్యులర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కు ముందు ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో కోల్ కతాలో బీజేపీలో చేరారు. ఈసారి పశ్చిమబెంగాల్ లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. మంచి ప్రేక్షకాదరణ ఉన్న రూపాగంగూలీ పార్టీలో చేరడం బీజేపీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
ఈ సందర్భంగా రూపా గంగూలీ మాట్లాడుతూ... ప్రధాని మోదీ పనితీరు, ఆయన నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీలో చేరానని చెప్పారు. మోదీ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నానని... ప్రజా సేవ చేసేందుకు తనకు ఏ పని అప్పగించినా చేస్తానని తెలిపారు. అమిత్ షా మార్గనిర్దేశంలో అందరూ గర్వపడేలా పని చేస్తానని చెప్పారు.
వినోద్ తావ్డే మాట్లాడుతూ... సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు మరియా ఆలం 'ఓట్ జీహాద్' వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఫరూఖాబాద్ ఎంపీ స్థానం నుంచి ఇండియా కూటమి తరపున మరియా పోటీ చేస్తున్నారు. బీజేపీని మైనార్టీ కమ్యూనిటీ అధికారం నుంచి దించడం అవసరమని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తావ్డే స్పందిస్తూ... ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తూ... ఓట్ జీహాద్ ను ప్రారంభించాయని మండిపడ్డారు.