ముంబై ఇండియన్స్ జట్టులో చీలిక.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సంచలన ఆరోపణ
- జట్టు సభ్యులు గ్రూపులుగా విడిపోయారని వ్యాఖ్య
- అందుకే మ్యాచ్ విన్నర్లు ఉన్న టీం ఇంత చెత్తగా ఆడుతోందని కామెంట్
- డ్రెస్సింగ్ రూపంలో వారంతా కలసిమెలసి ఉండట్లేదని అనుమానం
ఐపీఎల్ టైటిల్ ను ఇప్పటివరకు ఐదుసార్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఈసారి ఏమైంది? హిట్ మ్యాన్, స్కై, టిమ్ డేవిడ్, బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నా మ్యాచ్ లు ఎందుకు గెలవలేకపోతోంది? టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అనూహ్యంగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఇచ్చినప్పటి నుంచి జట్టు ఆటతీరు ఎందుకు దిగజారుతోంది? ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తోపాటు సగటు క్రికెట్ లవర్స్ ను కూడా వేధిస్తున్న ప్రశ్నలివి.
అయితే దీని వెనక ఒక బలమైన కారణం ఉందని మాజీ ఆల్ రౌండర్, 2015 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన మైఖేల్ క్లార్క్ అంటున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు గ్రూపులుగా చీలిపోయిందని సంచలన ఆరోపణ చేశాడు. ‘డ్రెస్సింగ్ రూంలో వేర్వేరు గ్రూపులు ఉన్నాయని అనుకుంటున్నా. వారు కలిసిమెలిసి ఉండట్లేదు. మనం బయట చూస్తున్న దానికన్నా లోపల ఇంకెంతో జరుగుతోంది. లేకపోతే అంత మంచి ప్లేయర్లు ఉన్న టీం ఇంత చెత్తగా ఆడదు. ఆడిన 10 మ్యాచ్ లలో ఏకంగా 7 మ్యాచ్ లు ఇలా ఓడిపోదు’ అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ లో క్లార్క్ వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఆటతీరు వల్ల ఎంఐ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం అనుమానమేనని అభిప్రాయపడ్డాడు.
ముంబై సాధించిన ఆ మూడు విజయాలు కూడా టీం ఎఫర్ట్ కాదని క్లార్క్ పేర్కొన్నారు. బుమ్రా, రొమారియో షెపర్డ్ ఒంటరి పోరాటం వల్లే ఆ మ్యాచ్ లలో ఎంఐ గెలిచిందని చెప్పాడు. భారీ టోర్నమెంట్లు గెలవాలంటే ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనకన్నా కూడా అందులోని సభ్యులంతా ఒక జట్టుగా కలసి ఉండాల్సి ఉంటుందన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ముంబై ఆటగాళ్లు అలా జట్టు లేరని వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కేవలం 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఫాఫ్ డూప్లెసీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా తమ 10 మ్యాచ్ లలో 7 ఓడి 6 పాయింట్లతో ఈ టేబుల్ లో చిట్టచివరన నిలిచింది.