కాంగ్రెస్‌లో చేరిన కడియం, తెల్లం వెంకట్రావుకు హైకోర్టు నోటీసులు
- బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు
- పార్టీ మారిన వీరిపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో కేపీ వివేకానంద పిటిషన్
- నోటీసులు ఇచ్చి జూన్ 5కు వాయిదా వేసిన న్యాయస్థానం
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నిన్న విచారించింది.
కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతోపాటు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. కాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మరో కేసులో హైకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసింది.