ప్రేయసితో కలిసి లాడ్జిలో బస చేసిన యువకుడి అనుమానాస్పద మృతి!
- హైదరాబాద్‌లోని ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- మృతుడిని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్‌గా గుర్తించిన పోలీసులు
- నిన్న రాత్రి ఎస్ఆర్‌నగర్‌లోని ఓయో టౌన్‌హౌస్‌లో ప్రేయసితో కలిసి బస చేసిన హేమంత్
- బాత్‌రూమ్‌లో పడి అనుమానాస్పద స్థితిలో మృతి
ప్రేయసితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని ఎస్ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ (28) అనే ఇటుకల వ్యాపారికి అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. ఏడేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.
ఈ క్రమంలో హేమంత్ యువతితో కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యాడు. రాత్రి ఎస్ఆర్‌నగర్‌లోని ఓయో టౌన్‌హౌస్‌లో గది తీసుకుని బస చేశారు. మద్యం సేవించిన హేమంత్ రాత్రి 2 గంటల ప్రాంతంలో టాయిలెట్‌కు వెళ్లాడు. అయితే, ఎంతసేపటికీ అతడు బాత్‌రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన యువతి వెళ్లి చూసింది. దాంతో హేమంత్ బాత్‌రూమ్‌లో స్పృహలేకుండా పడి ఉండడం గమనించిందామె. వెంటనే అతని స్నేహితులకు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
దీంతో స్నేహితులు లాడ్జీకి వచ్చి హేమంత్‌ను బెడ్‌పై పడుకొబెట్టి 108కు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి అప్పటికే అతడు చనిపోయినట్లు తెలిపారు. కుమారుడి మృతి విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే హేమంత్ మరణానికి కారణాలు తెలుస్తాయని ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు.