తన రిటైర్మెంట్ వెనుక ఉన్న కారణాన్ని చెప్పి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ మాజీ క్రికెటర్!
- టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమైన మాజీ క్రికెటర్ ఉమర్ గుల్
- మిత్రుడు కలీమ్‌ను యాక్సిడెంట్‌లో కోల్పోవడంతో ఆ బాధలోనే క్రికెట్ నుంచి వైదొలిగినట్లు వెల్లడి
- ఈ విషయం ఇప్పటివరకు తన భార్యకు కూడా చెప్పలేదన్న గుల్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఉమర్ గుల్ 'ఏ స్పోర్ట్స్' అనే టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడానికి గల కారణాన్ని చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. తన ప్రాణ స్నేహితుడైన కలీమ్ అనే వ్యక్తిని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడంతో ఆ బాధలోనే తాను క్రికెట్ నుంచి వైదొలిగినట్లు గుల్ వెల్లడించాడు. ఈ విషయం ఇప్పటివరకు తన భార్యకు కూడా చెప్పలేదన్నాడు. సరిగ్గా రంజాన్ పండుగకు రెండు రోజుల ముందు తన మిత్రుడిని కోల్పోవడం తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజుగా అతడు పేర్కొన్నాడు.
ఉమర్ గుల్ మాట్లాడుతూ.. "కరోనా మొదటి దశ సమయంలో నా ప్రాణ స్నేహితుడు కలీమ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రంజాన్ పండుగకు రెండు రోజుల ముందు ఈ ఘటన జరిగింది. అతడి మృతిని జీర్ణించుకోలేకపోయా. అందుకే క్రికెట్‌కు వీడ్కోలు పలికా. ఈ విషయం నా భార్యకు కూడా తెలియదు" అని గుల్ గద్గద స్వరంతో చెప్పాడు. ఉమర్ గుల్ ఈ ఇంటర్వ్యూ తాలూకు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు గుల్‌కు సంఘీభావం తెలియజేస్తున్నారు.