ముంబయి బ్యాటింగ్ వైఫల్యం... లక్నో ముందు ఈజీ టార్గెట్
- ఐపీఎల్ లో ఇవాళ ముంబయి ఇండియన్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసిన ముంబయి
- రాణించిన వధేరా, టిమ్ డేవిడ్, ఇషాన్ కిషన్
- లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో మ్యాచ్
ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్ మెన్ వైఫల్యం కొనసాగుతోంది. ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది.
ముంబయి ఇన్నింగ్స్ లో నేహాల్ వధేరా చేసిన 46 పరుగులే అత్యధికం. చివర్లో టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 35 నాటౌట్) దూకుడుగా ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
ముంబయి స్కోర్ కార్డ్ చూస్తే... ఓపెనర్ రోహిత్ శర్మ (4) ఆదిలోనే అవుటయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 32, సూర్యకుమార్ యాదవ్ 10, తిలక్ వర్మ 7 పరుగులు చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (0) మరీ దారుణంగా ఆడిన తొలి బంతికే డకౌట్ అయ్యాడు.
లక్నో బౌలర్లలో మొహిసిన్ ఖాన్ 2, స్టొయినిస్ 1, నవీనుల్ హక్ 1, మయాంక్ యాదవ్ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు.