చివరి అరగంటలో నష్టపోయిన మార్కెట్లు

  • 188 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 38 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4.53 శాతం పెరిగిన ఎం అండ్ ఎం షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో ఈరోజు కూడా మన మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. అయితే చివరి అరగంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో, మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188 పాయింట్లు కోల్పోయి 74,482కి పడిపోయింది. నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 22,604 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.53%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.87%), బజాజ్ ఫైనాన్స్ (1.52%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.27%).  

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.08%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.50%), టాటా స్టీల్ (-1.46%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.41%), సన్ ఫార్మా (-1.29%).


More Telugu News