తెలంగాణలో 11 లోక్ సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్

తెలంగాణలో 11 లోక్ సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్
  • పరిశీలకులను నియమిస్తూ హైకమాండ్ ఉత్తర్వులు
  • మహబూబ్ నగర్ పరిశీలకుడిగా చంద్రశేఖర్
  • సికింద్రాబాద్ పరిశీలకుడిగా రిజ్వాన్ హర్షద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ... లోక్ సభ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. దానికి తగినట్టుగా వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా 11 లోక్ సభ స్థానాలకు పరిశీలకులను నియమించింది. పరిశీలకులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. 

11 నియోజకవర్గాలకు పరిశీలకులు వీరే:

  • మెదక్ - కుడి కున్నీల్ సురేష్
  • జహీరాబాద్ - రాజ్ మోహన్ ఉన్నితన్
  • మహబూబ్ నగర్ - చంద్రశేఖర్
  • మల్కాజ్‌ గిరి - జ్యోతిమణి
  • చేవెళ్ల - హిబ్బి ఏడెన్
  • ఆదిలాబాద్ - షఫీ పరంబిల్
  • నిజామాబాద్ - బోస్ రాజు
  • నాగర్ కర్నూల్ - పీవీ మోహన్
  • సికింద్రాబాద్ - రిజ్వాన్ హర్షద్
  • వరంగల్ - రవీంద్ర దాల్వి
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ - పీ విశ్వనాథన్.


More Telugu News