సెక్స్ స్కాండల్ వివాదం.. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ ను సస్పెండ్ చేసిన సొంత పార్టీ జేడీఎస్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజ్వల్ వీడియోలు
- లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ, జేడీఎస్ కూటమికి పెను సమస్య
- నష్ట నివారణ చర్యలు చేపట్టిన జేడీఎస్
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఎంతో మంది మహిళలను ఆయన లైంగికంగా వేధిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. వందలాది మహిళలతో ఉన్న అశ్లీల వీడియోలను ప్రజ్వల్ స్వయంగా వీడియోలు తీశారు. ప్రజ్వల్ పై ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
2019 - 2022 మధ్యలో ప్రజ్వల్ తనను ఎన్నోసార్లు లైంగిక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తన కూతురుని కూడా ప్రజ్వల్ లైంగికంగా వేధించారని తెలిపారు. ఇదే సమయంలో ప్రజ్వల్ తండ్రి రేవణ్ణపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవణ్ణ భార్య ఇంట్లో లేని సమయంలో... ఆయన తన పట్ల దారుణంగా వ్యవహరించేవారని తెలిపారు.
ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం హాసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గానికి దేవెగౌడ ప్రాతినిధ్యం వహించారు. రేవణ్ణ ప్రస్తుతం హోలెనరసిపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే... 33 ఏళ్ల ప్రజ్వల్ జర్మనీకి చెక్కేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జేడీఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జేడీఎస్ పార్టీ నుంచి ప్రజ్వల్ ను సస్పెండ్ చేసింది.