నేడు రోహిత్ శర్మ 37వ బర్త్‌డే.. హిట్‌మ్యాన్ క్రికెట్ కెరీర్‌లోని పలు ఆసక్తికర అంశాలు..!
- 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్
- మొదటి ఆరేళ్ల పాటు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్
- 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఓపెనర్‌గా ఛాన్స్
- ఇప్పటి వరకు 262 వన్డేల్లో 31 శతకాలు, 55 అర్ధ శతకాలతో 10,709 పరుగులు
- వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) రోహిత్‌దే
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నేడు 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. హిట్‌మ్యాన్ బర్త్‌డే సందర్భంగా అతను సాధించిన అద్భుత విజయాలు, నెలకొల్పిన రికార్డులు, అతని క్రికెట్ కెరీర్‌లోని పలు ఆసక్తికర అంశాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.
తనదైన బ్యాటింగ్ శైలితో బౌలర్లను హడలెత్తించే రోహిత్ శర్మ.. ఒక మంచి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం టీమిండియాకు టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్‌లకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20ల నుంచి విరామం తీసుకున్న అతడు ఇప్పుడు మళ్లీ ఈ ఫార్మాట్‌లో జట్టు పగ్గాలు అందుకోబోతున్నాడు. 2023లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను త్రుటిలో చేజార్చుకున్న హిట్‌మ్యాన్, ఇప్పుడు 2024 టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్‌లో బీజీగా ఉన్నాడు.
రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొదలైంది ఇలా..
రోహిత్ శర్మ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సంవత్సరం ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2007లో రోహిత్ పెర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఆడిన మూడు మ్యాచుల్లో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై 16 బంతుల్లోనే అజేయంగా 30 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అప్పటి నుంచే విధ్వంసకర యువ ఆటగాడిగా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక తన కెరీర్‌లో మొదటి ఆరేళ్ల పాటు మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి దిగేవాడు. అయితే, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం దక్కింది. అప్పటి నుంచి హిట్‌మ్యాన్ కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌లలో 35.40 సగటుతో 177 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఓపెనర్‌గా రోహిత్ శర్మ దూకుడు
ఓపెనర్‌గా మారిన తర్వాత నుంచి రోహిత్ శర్మ దూకుడు పెరిగింది. ఇప్పటి వరకు అతడు 262 వన్డేల్లో 49.12 సగటుతో 10,709 పరుగులు చేశాడు. ఇందులో 31 శతకాలు, 55 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 264. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కూడా. విరాట్ (50), సచిన్ (49) తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒకటి కంటే ఎక్కువ (3) డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మనే.
సచిన్ టెండూల్కర్ (18,426), విరాట్ కోహ్లీ (13,848), సౌరవ్ గంగూలీ (11,221), రాహుల్ ద్రవిడ్ (10,768), మహేంద్ర సింగ్ ధోనీ (10,599) తర్వాత వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడు. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచంలో 15వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 2019 వన్డే వరల్డ్ కప్ రోహిత్ కెరీర్‌లోనే ప్రత్యేకం అని చెప్పాలి. ఈ ఐసీసీ టోర్నీలో అతడు ఏకంగా ఐదు శతకాలు నమోదు చేశాడు. అలాగే గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ సారధిగా బాగానే రాణించాడు. 597 పరుగులతో టోర్నీలోనే రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అటు టెస్టుల్లో కూడా రోహిత్ సత్తాచాటాడు. 59 మ్యాచ్‌ల(101 ఇన్నింగ్స్) లో 45.46 సగటుతో 4,137 పరుగులు బాదాడు.
ఐపీఎల్‌లో విజయవంతమైన సారధి
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ విజయవంతమైన సారధిగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడు. అత్యధిక టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో (2013, 2015, 2017, 2019, 2020)లో ముంబై ఫ్రాంచైజీ టైటిల్స్ సాధించింది. అటు హైదరాబాద్ ఫ్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్ 2009లో ట్రోఫీ గెలిచినప్పుడు రోహిత్ ఆ జట్టులో సభ్యుడు. ఇలా మొత్తంగా ఆరు ఐపీఎల్ ట్రోఫీలలో పాలుపంచుకున్నాడు.
ఇక ఈ క్యాష్‌లీగ్ చరిత్రలో రోహిత్ అత్యధిక పరుగులు సాధించిన నాలుగో బ్యాటర్. మొత్తంగా ఇప్పటివరకు 252 మ్యాచ్‌లలో 29.92 సగటుతో 6,522 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 42 అర్ధ శతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రోహిత్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 109 (నాటౌట్). ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఎంఐ హిట్‌మ్యాన్ నుంచి సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించిన విషయం తెలిసిందే.