200 కోట్లు కొల్లగొట్టిన 'సైతాన్' .. నెట్ ఫ్లిక్స్ తెరపైకి!

  • మార్చి 8న విడుదలైన 'సైతాన్' 
  • సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
  • ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగణ్ - జ్యోతిక 
  • ప్రతినాయక పాత్రలో కనిపించిన మాధవన్  
ఈ ఏడాది బాలీవుడ్ లో భారీ విజయాలను నమోదు చేసిన సినిమాలలో 'సైతాన్' ఒకటి. అజయ్ దేవగణ్ .. జ్యోతిక .. మాధవన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, హారర్ .. సూపర్ నేచురల్ పవర్ ను కలుపుకుంటూ ముందుకు వెళుతుంది. హారర్ కంటెంట్ కి సూపర్ నేచురల్ ఎలిమెంట్ ను యాడ్ చేయడమే ఈ సినిమా ప్రత్యేకతగా అనిపిస్తుంది. అయితే ఈ అంశమే ఈ సినిమాకి మైనస్ అయిందనే వారు లేకపోలేదు. 

 అమిత్ త్రివేది నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించాడు.  65 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 211 కోట్లను వసూలు చేయడం విశేషం. ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఎప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తుందా అని ఎదురుచూసేవారు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. మే 3వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.

కబీర్ (అజయ్ దేవగణ్) తన ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్ కి వెళతాడు. మార్గమధ్యంలో తారసపడిన వనరాజ్ (మాధవన్) వారిని అనుసరిస్తూ వెళతాడు. కబీర్ కూతురు జాన్వీ (జాంక్వీ)పై వనరాజ్ చేసిన ప్రయోగం ఫలిస్తుంది. అప్పటి నుంచి ఆ అమ్మాయి విపరీత చేష్టలతో భయపెడుతూ ఉంటుంది. వనరాజ్ నుంచి తమ బిడ్డను కాపాడుకోవడానికి కబీర్ దంపతులు ఏం చేస్తారు? అనేదే కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి. 


More Telugu News