దేవెగౌడ మనవడు ప్రజ్వల్ అశ్లీల వీడియోల అంశంపై సినీ నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు

  • దేవెగౌడ కుమారుడు రేవణ్ణ కొడుకు ప్రజ్వల్
  • ప్రజ్వల్ కు డబ్బు, పలుకుబడి ఉన్నాయన్న పూనం కౌర్
  • ఈ ప్రభుత్వం ఆయనను ఏమీ చేయలేదని వ్యాఖ్య
సినీ నటి పూనం కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏ విషయం గురించి అయినా ఆమె తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు వ్యక్తపరుస్తుంటారు. ఆమె చేసే కామెంట్లు ఎన్నో సార్లు వివాదాస్పదమయ్యాయి. మరోవైపు, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కొడుకు) అసభ్యకర వీడియోల అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజ్వల్ దేశాన్ని వదిలి వెళ్లారు. ఆయన జర్మనీకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. 

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని దేవెగౌడ పార్టీ జేడీఎస్ పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ వ్యవహారం ఆ కూటమిపై పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ అంశంపై పూనం కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవణ్ణ జర్మనీకి పారిపోయారని ఆమె తెలిపింది. ఆయనకు ఎంతో డబ్బు, పలుకుబడి వున్నాయని... అందుకే ఈ ప్రభుత్వం ఆయనను ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన సేఫ్ గా జర్మనీకి వెళ్లిపోయారని చెప్పారు.


More Telugu News