కొవిషీల్డ్ టీకాతో రక్తం గడ్డకట్టడం నిజమే.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా
- ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి టీకాను అభివృద్ధి చేసిన బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం
- టీకా తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు నిజమేనని అంగీకారం
- ఈ మేరకు యూకే హైకోర్టుకు తెలిపిన ఆస్ట్రాజెనెకా
- ఆస్ట్రాజెనెకాపై రూ. 1000 కోట్లకు దావా
కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా బిగ్ షాకిచ్చింది. ఈ టీకా తీసుకున్న వారికి అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనంటూ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొన్నట్టు యూకేకు చెందిన డైలీ టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ పేర్కొంది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని అంగీకరించింది. కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా ఈ వ్యాక్సిన్ (కొవిషీల్డ్)ను అభివృద్ధి చేసింది. ఇదే వ్యాక్సిన్‌ను మన దేశంలో సీరం ఇనిస్టిట్యూట్ తయారుచేసింది. దేశంలో అత్యధికంగా తీసుకున్న టీకా ఇదే.
ఈ టీకా ఒకరి మృతికి కారణం కావడంతోపాటు మరో 51 మంది తీవ్రంగా ఇబ్బంది పడినట్టు కేసు నమోదైంది. జరిగిన నష్టానికి 100 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 1000 కోట్లు) పరిహారం కోరుతూ యూకే హైకోర్టులో దావా నమోదైంది. ఏప్రిల్ 2021లో ఈ టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో తన మెదడు శాశ్వతంగా దెబ్బతిందని జామీ స్కాట్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ కారణంగా తాను ఉద్యోగం చేయలేకపోయానని, తాను చనిపోబోతున్నట్టు వైద్యులు తన భార్యతో చెప్పారని పేర్కొన్నాడు.
కొవిషీల్డ్‌తో దుష్ప్రభావాలు నిజమేనని కోర్టుకు సమర్పించిన పేపర్లలో ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. చాలా అరుదుగా ఇది టీటీఎస్ (థ్రాంబోసిస్ విత్ త్రాంబోసైటోపెనియా సిండ్రోమ్)కు కారణమవుతున్నట్టు తెలిపింది. దీనివల్ల రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ల కౌంట్ పడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొవిషీల్డ్‌తో దుష్ప్రభావాలు నిజమేనని అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.. టీకా సామర్థ్యంపై వస్తున్న వార్తలను మాత్రం ఖండించింది.