కాంగ్రెస్‌కు షాక్... బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత
- కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన వెంకటేశ్ నేత
- 2019లో బీఆర్ఎస్ ఎంపీగా గెలిచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన వెంకటేశ్ నేత
- కమలం జెండా కప్పుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి
లోక్ సభ ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత సోమవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా బీజేపీలో చేరారు. వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వెంకటేశ్ నేత 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్‌కు టిక్కెట్ ఇచ్చింది. ఈ క్రమంలో వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అంతలోనే మళ్లీ ఈరోజు కమలం పార్టీ కండువాను కప్పుకున్నారు. పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ను గెలిపించేందుకు కృషి చేస్తారని కిషన్ రెడ్డి చెప్పారు.