కాంగ్రెస్ కోరుకుంటున్నది జరగనివ్వను: మోదీ

  • మత రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ యత్నిస్తోందన్న మోదీ
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను లాక్కునే ప్రయత్నం చేస్తోందని మండిపాటు
  • కాంగ్రెస్ దురుద్దేశాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచన
దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోందని... కాంగ్రెస్ కోరికను తాను నెరవేరబోనివ్వనని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ కు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే కావాలని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు ప్రస్తుతం బీజేపీ వెంట ఉన్నాయని... అందుకే మైనార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు మత రిజర్వేషన్ల గురించి మాట్లాడుతోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను లాక్కునేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని అన్నారు. మన రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించదని చెప్పారు. కర్ణాటకలో నిర్వహించిన ఓ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ దురుద్దేశాలను ప్రజలు అర్థం చేసుకోవాలని మోదీ సూచించారు. అంబేద్కర్ ఇచ్చిన మీ హక్కును దోచుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని చెప్పారు. పార్లమెంటులో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని అన్నారు. ఈ ర్యాలీలో  మాజీ సీఎం యెడియూరప్ప, బీజేపీ అభ్యర్థులు గడ్డి గౌడర్, రమేశ్ జిగజినగి కూడా పాల్గొన్నారు.


More Telugu News