మీరెలా ఉన్నారని కేజ్రీవాల్ ను అడిగితే.. ఆయన చెప్పిన సమాధానం ఇదే..: ఢిల్లీ మంత్రి అతిశీ
- కేజ్రీవాల్ ను కలిసిన భార్య సునీత, మంత్రి అతిశీ
- ప్రజల సమస్యల గురించే కేజ్రీవాల్ అడిగారన్న అతిశీ
- జైల్లో కొత్తకొత్త నిబంధనలు పెడుతున్నారని మండిపాటు
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయనను భార్య సునీత కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రి అతిశీ కలిశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రేపు కేజ్రీవాల్ ను కలవనున్నారు.
కేజ్రీవాల్ ను కలిసిన తర్వాత అతిశీ మీడియాతో మాట్లాడుతూ... 'ఎలా ఉన్నారని కేజ్రీవాల్ ను నేను అడిగాను. నా పరిస్థితి గురించి అడగొద్దు. ఢిల్లీ ఎలా ఉంది? అని కేజ్రీవాల్ అడిగారు. విద్యార్థులకు పుస్తకాలు అందుతున్నాయా.. మొహల్లా క్లినిక్స్ లో మందులు లభిస్తున్నాయా? అని అడిగారు. వేసవి సమయంలో నీటి సమస్య ఉండకూడదని చెప్పారు. ఢిల్లీ మహిళలకు రూ. 1000 చొప్పున ఇస్తామని తెలిపారు' అని కేజ్రీవాల్ చెప్పారని అన్నారు.
మరోవైపు కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన భార్యకు అనుమతిని ఇవ్వలేదంటూ అంతకు ముందు ఆప్ ఆరోపించింది. దీనిపై అతిశీ మాట్లాడుతూ... కేజ్రీవాల్ ను కలిసేందుకు ఇద్దరికి అనుమతి ఇచ్చారని... అయితే సునీతను నిరాకరించారని చెప్పారు. ఆ తర్వాత తమ లాయర్లు చేసిన పోరాటంతో సునీతను అనుమతించారని తెలిపారు. ప్రతిరోజు కొత్తకొత్త నిబంధనలు పెడుతున్నారని విమర్శించారు.