జనం సొమ్ముతో చేపట్టే పథకాలకు జగన్ పేరు ఎందుకు?: లంకా దినకర్

  • రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన జగన్ కు లేదన్న లంకా దినకర్
  • ప్రతి రంగంలో రాష్ట్రాన్ని దోచేశారని మండిపాటు
  • అప్పుల్లో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని విమర్శ
స్థూల జాతీయ ఉత్పత్తిలో ఏపీ బాగా వెనుకబడిపోయిందని బీజేపీ నేత లంకా దినకర్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం దారుణంగా తయారయిందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో స్థూల జాతీయ ఉత్పత్తిలో ఏపీ ఐదో స్థానంలో ఉంటే... జగన్ పాలనలో 14వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు... చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే సరిపోతోందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన జగన్ కు లేదని అన్నారు. 

ప్రతి రంగంలో రాష్ట్రాన్ని దోచేశారని ఆరోపించారు. మద్యం, మైనింగ్, ఇసుక, విద్యుత్ ఇలా ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. అప్పుల్లో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని అన్నారు. రాష్ట్ర అప్పు రూ. 14 లక్షల కోట్లు అని... అందులో రూ. 8 లక్షల కోట్లు దోచేశారని మండిపడ్డారు. చెప్పుకునేది కొండంత... దోచుకున్నది అనకొండంత అని చెప్పారు. జనం సొమ్ముతో చేపట్టే పథకాలకు జగన్ పేరు ఎందుకని ప్రశ్నించారు. 2014-19 మధ్య కాలంలో నీటి ప్రాజెక్టులకు చంద్రబాబు రూ. 62,990 కోట్లు ఇచ్చారని... జగన్ కేవలం రూ. 26 వేల కోట్లను మాత్రమే కేటాయించారని చెప్పారు.


More Telugu News