ఓయు విద్యార్థిని వీడియోను ట్వీట్ చేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేసీఆర్
- విద్యుత్, తాగు, సాగునీటిపై సీఎం, ఉపముఖ్యమంత్రి నాలుగు నెలలుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ
- యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులే తాగు, సాగునీటి కొరతకు నిదర్శనమని వెల్లడి
- తెలంగాణలో విద్యుత్, తాగు, సాగునీటి ఎద్దడి ఉన్నమాట వాస్తవమన్న కేసీఆర్
తెలంగాణలో విద్యుత్ కోత, తాగునీరు కొరత, సాగునీటి ఎద్దడి వున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నీటి సమస్య ఉందని చెబుతున్న వీడియోను బీఆర్ఎస్ అధినేత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో విద్యుత్, తాగు, సాగునీటిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గత నాలుగు నెలలుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులే తాగు, సాగునీటి కొరతకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్, తాగు, సాగునీటి ఎద్దడి ఉన్నమాట వాస్తవమని తెలిపారు.
కేసీఆర్ ట్వీట్ చేసిన వీడియోలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థినులు నీటి కోసం ఆందోళన చేస్తున్నారు. ఓ విద్యార్థిని మాట్లాడుతూ 'తాగడానికి కూడా నీళ్లు లేవు. అమ్మాయిలకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మినిమం తాగడానికి లేదా వాడటానికి నీళ్లు అవసరం. ఇంతమంది అమ్మాయిలకు ఒక ట్యాంకర్ పంపించారు ఇప్పుడు. దానిని ఏం చేసుకోవాలి. పూజ చేసుకోవాలా? ఆ వాటర్ని చూసి మురిసిపోవాలా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.