ప్రత్యేకహోదా కోసం ఎవరి దగ్గర మెడలు వంచారు?: కనకమేడల
- జగన్ నిజంగా 99 శాతం హామీలను నెరవేర్చారా అని కనకమేడల ప్రశ్న
- మద్య నిషేధం అని చెప్పి.. కల్తీ మద్యం పంపిణీ చేస్తున్నారని విమర్శ
- ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపాటు
ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శలు గుప్పించారు. జగన్ గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను పూర్తి చేశామని జగన్ చెప్పుకుంటున్నారని... నిజంగా ఆయన 99 శాతం హామీలను పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్దిని, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి, కల్తీ మద్యం పంపిణీ చేస్తున్నారని కనకమేడల మండిపడ్డారు. మద్యం తయారీని బంధులవుకు అప్పగించారని... దాన్ని తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 25 మంది ఎంపీలను ఇస్తే... కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారని... జగన్ ఎవరి దగ్గర మెడలు వంచారని అన్నారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.