దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. 941 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు
- బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరు
- 223 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
గత వారమంతా లాభాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు... చివరి సెషన్ (శుక్రవారం)లో మాత్రం నష్టపోయాయి. ఈ రోజు మళ్లీ భారీ లాభాలతో దూసుకుపోయాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాకింగ్ షేర్లలో కొనుగోళ్ల జోరుతో భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 941 పాయింట్లు లాభపడి 74,671కి పెరిగింది. నిఫ్టీ 223 పాయింట్లు పుంజుకుని 22,643కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్(4.67%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.09%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.93%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.90%), యాక్సిస్ బ్యాంక్ (2.47%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-5.79%), ఐటీసీ (-0.44%), విప్రో (-0.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.01%).