కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన వ్యక్తి.. కాపాడిన మహిళా పోలీస్​.. వీడియో ఇదిగో!

  • కదులుతున్న రైలు ఎక్కబోయి పట్టాలకు, ప్లాట్ ఫామ్ కు మధ్య పడిన వ్యక్తి
  • అది చూసి పరుగెత్తుకు వచ్చిన లేడీ కానిస్టేబుల్
  • రైలు వెళ్లే వరకు ఆ వ్యక్తిని అదిమి పట్టుకున్న వైనం
  • ఉత్తరాఖండ్ లోని లక్సర్ రైల్వే స్టేషన్ లో ఘటన
కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ వ్యక్తి పట్టు తప్పి పడిపోయాడు. ఓ వైపు రైలు అలా కదులుతూ ఉండగానే.. పట్టాలకు, ప్లాట్ ఫామ్ కు మధ్య పడ్డాడు. తానే మాత్రం కదిలినా, కాస్త పైకి లేచేందుకు ప్రయత్నించినా.. అత్యంత దారుణంగా చనిపోయే ప్రమాదం ఉండేది. కానీ ఆ వ్యక్తిని గమనించిన ఉమ అనే మహిళా రైల్వే కానిస్టేబుల్ వేగంగా పరుగెత్తుకుని వచ్చింది. కదులుతున్న రైలు బోగీలు, రైలు మెట్లు తగలకుండా ఆ ప్రయాణికుడిని ప్లాట్ ఫామ్ కు అదిమి గట్టిగా పట్టుకుంది.

సీసీ కెమెరా ఫుటేజీతో..
ఉత్తరాఖండ్ లోని లక్సర్ రైల్వే స్టేషన్ లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కోల్ కతా–జమ్మూ తావి ఎక్స్ ప్రెస్ రైలులో వెళ్లాల్సిన ప్రయాణికుడు ఈ ప్రమాదానికి గురయ్యాడు. కాసేపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికాడు. మహిళా కానిస్టేబుల్ ఉమ చొరవతో.. సురక్షితంగా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని ఉత్తరాఖండ్ పోలీసు విభాగం తాజాగా ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
  • ‘ఎక్స్’లో  ఈ వీడియోను చూసిన నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ‘గుడ్ జాబ్.. ఉమకు అవార్డు దక్కాలి’ అని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
  • రైలు బోగీ మెట్లుగానీ, ఇతర భాగాలు గానీ తాకే ప్రమాదం ఉంటుందని తెలిసినా.. కానిస్టేబుల్ ఉమ ధైర్యంగా ప్రయాణికుడిని కాపాడిందని ప్రశంసలు వస్తున్నాయి.
దిగువన ఆ వీడియోను మీరూ చూసేయండి..


More Telugu News