ప్రజల భూములు కొట్టేసేందుకు జగన్ కుట్రలు: దేవినేని ఉమా
- వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన భూ హక్కు చట్టంపై టీడీపీ నేత ధ్వజం
- రాష్ట్రంలో ప్రజల ఆస్తులు ప్రమాదంలో పడ్డాయని వ్యాఖ్య
- ప్రజల వ్యక్తిగత ఆస్తులపై మీ పెత్తనం ఏంటి? అంటూ దేవినేని ఉమా మండిపాటు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన భూ హక్కు చట్టంపై ఆయన ధ్వజమెత్తారు. ప్రజల భూములు కొట్టేసేందుకు భూ హక్కు చట్టం పేరుతో జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులు ప్రమాదంలో పడ్డాయని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా టైటిల్ పేరిట సర్కార్ వంచన చేస్తోందని విమర్శించారు. హక్కులను హరించడమే కాకుండా న్యాయం కోరే అవకాశం ఉండదన్నారు. ప్రజల వ్యక్తిగత ఆస్తులపై మీ పెత్తనం ఏంటి? అంటూ టీడీపీ నేత మండిపడ్డారు. భూభక్ష పథకంతో వైఎస్ జగన్.. సామాన్యుడిని సర్వం దోచేస్తాడంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.