కోహ్లీ ఓపెనర్‌గా ఆడొద్దు.. టీ20 వర్డల్ కప్‌పై సెహ్వాగ్ కామెంట్

  • ఈ ఐపీఎల్ సీజన్‌లో మంచి ఫామ్‌లో విరాట్ కోహ్లీ
  • టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఓపెనర్‌గా దిగాలంటున్న నిపుణులు
  • కోహ్లీ నెం.3 స్థానంలోనే ఆడాలన్న సెహ్వాగ్ 
  • 2007 వరల్డ్ కప్‌లో సచిన్ నెం.4 స్థానంలో ఆడిన విషయాన్ని గుర్తు చేసిన వైనం
  • టీంలో మంచి ఓపెనర్లు ఉన్నప్పుడు మిడిల్ ఆర్డర్‌లో ఆడటం మంచిదని సలహా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఫాంతో దూసుకుపోతున్నాడు. దీంతో, రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో కోహీ, రోహిత్ శర్మ ఓపెనర్లుగా దిగాలన్న కామెంట్స్ మొదలయ్యాయి. దీనిపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా స్పందించాడు. విరాట్‌ మూడో స్థానంలోనే ఆడాలని, ఓపెన్లర్ల దూకుడును మిడిల్ ఓవర్లలోనూ కోనసాగించాలని అభిప్రాయపడ్డాడు. 2007 వరల్డ్ కప్‌లో సచిన్ టెండుల్కర్ 4వ స్థానంలో ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు.  

‘‘సచిన్ అప్పట్లో ఓపెనర్ స్థానం వదులుకుని నాల్గవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. సచిన్‌కు కూడా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం ఇష్టం లేదు కానీ టీం కోసం సిద్ధమయ్యాడు. మన టీంలో మంచి ఓపెనర్లు ఉన్నప్పుడు మనం మూడో స్థానంలో ఆడటం తప్పుకాదు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నాకు తెలిసి విరాట్ కోహ్లీ కూడా నెం.3 స్థానంలో ఆడేందుకు అభ్యంతరం పెట్టడు’’ అని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. 

మరోవైపు, నిన్నటి ఐపీఎల్ మ్యాచ్‌లో జీటీపై తన ఆర్సీబీ విజయం తరువాత కోహ్లీ విమర్శకులపై మండిపడ్డాడు. ‘‘ఆటగాడు జట్టుకు విజయాలు చేకూర్చడంపైనే దృష్టిపెడతాడు. స్ట్రైక్ రేట్ పై కాదు. గత 15 ఏళ్లుగా ఇదే చేస్తున్నా. టీం కోసం ఎన్నో మ్యాచులు గెలిచా. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వారికే ఈ అంశంపై అవగాహన ఉంటుంది’’ అని కామెంట్ చేశాడు.


More Telugu News