ఐపీఎల్‌లో ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా ధోనీ.. మరో రికార్డును తన పేరున రాసుకున్న దిగ్గజం
- 2008 నుంచి ఇప్పటి వరకు 259 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోనీ
- 150 విజయాల్లో భాగస్వామ్యం
- కెప్టెన్‌గా 133 విజయాలు సాధించిన ఎంఎస్‌డీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డు సృష్టించాడు. టీ20 టోర్నమెంట్ చరిత్రలో 150 విజయాల్లో పాలుపంచుకున్న ఒకే ఒక్క క్రికెటర్‌గా అవతరించాడు. గత రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ధోనీ ఖాతాలో ఈ అరుదైన రికార్డు వచ్చి చేరింది.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ ఇప్పటి వరకు 259 మ్యాచ్‌లు ఆడాడు. చెన్నైకి సారథిగా 5 ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. ప్రస్తుత సీజన్‌లో ఆ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తున్నాడు. ఇక, ధోనీ తర్వాత అత్యధిక విజయాల్లో భాగస్వామ్యం అయిన ఆటగాళ్లలో రవీంద్ర జడేజా (133), రోహిత్ శర్మ (133), దినేశ్ కార్తీక్ (125), సురేశ్ రైనా (122) ఉన్నారు. ఇక, కెప్టెన్‌గా ధోనీ 133 విజయాలు సాధిస్తే, రోహిత్ శర్మ 87 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు.