సెంచరీ చేజార్చుకున్న సీఎస్కే కెప్టెన్... సన్ రైజర్స్ ముందు భారీ టార్గెట్

  • చెన్నైలో సన్ రైజర్స్ × సీఎస్కే
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసిన సూపర్ కింగ్స్
  • చేజింగ్ లో 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ 
చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 54 బంతుల్లో 98 పరుగులు చేసిన గైక్వాడ్... నటరాజన్ బౌలింగ్ లో అవుటై తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరాడు. అతడి స్కోరులో 10 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. 

డారిల్ మిచెల్ 52, శివమ్ దూబే 39 (నాటౌట్) పరుగులతో రాణించగా... సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసింది. అజింక్యా రహానే (9) మళ్లీ విఫలమయ్యాడు. ఆఖర్లో వచ్చిన ధోనీ ఒక ఫోర్ కొట్టి 5 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, నటరాజన్ 1, జయదేవ్ ఉనద్కట్ 1 వికెట్ తీశారు.

అనంతరం, 213 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సన్ రైజర్స్ 21 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ 13 పరుగులు చేసి అవుట్ కాగా, ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ (0) ఆడిన తొలి బంతికే వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు చెన్నై పేసర్ తుషార్ దేశ్ పాండే ఖాతాలోకి చేరాయి.  

ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోరు 3 ఓవర్లలో 2 వికెట్లకు 33 పరుగులు. ఓపెనర్ అభిషేక్ శర్మ 10, ఐడెన్ మార్ క్రమ్ 10 పరుగులతో ఆడుతున్నారు.


More Telugu News