చెన్నైలో సీఎస్కేతో మ్యాచ్... టాస్ గెలిచిన సన్ రైజర్స్
- చిదంబరం స్టేడియంలో సన్ రైజర్స్ × సీఎస్కే
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- గత మ్యాచ్ లో ఛేజింగ్ లో విఫలమైన సన్ రైజర్స్
ఐపీఎల్ టోర్నీలో పాట్ కమిన్స్ నాయకత్వంలో మెరుగైన ఆటతీరు కనబరుస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ మరో కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ కు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తోంది.
గత మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పాలైన సన్ రైజర్స్ నేడు చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచి తీరాలన్న కసితో ఉంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ సారథి కమిన్స్ లక్ష్యఛేదనకు మొగ్గుచూపాడు.
మొన్న ఆర్సీబీతో మ్యాచ్ లో ఛేజింగ్ లో విఫలం కావడంతో, ఛేజింగ్ లోనూ నిరూపించుకోవాలన్న ఉద్దేశంతోనే సన్ రైజర్స్ ఇవాళ కావాలని ఫీల్డింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఆడడంలేదు. అటు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేవు.