ప్రజలందరూ బాగుంటే నేను ఓటు అడగను: కౌతాళం సభలో చంద్రబాబు
- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజాగళం సభ
- హాజరైన చంద్రబాబు
- కర్నూలు పార్లమెంటు స్థానం పరిధిలో సామాజిక న్యాయం పాటించామని వెల్లడి
- ఓ ఎంపీటీసీకి ఎంపీ టికెట్ ఇచ్చామని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, టికెట్ల కేటాయింపులో తాము సామాజిక న్యాయం పాటించామని వెల్లడించారు. ఆస్తిపాస్తులు లేకపోయినప్పటికీ కురుబ సామాజిక వర్గానికి చెందిన సాధారణ ఎంపీటీసీ నాగరాజుకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చామని వెల్లడించారు.
మరోవైపు, రాఘవేంద్రరెడ్డిని స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశామని వెల్లడించారు. కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు, ఆ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను తామే గెలుస్తున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
"పక్కనే తుంగభద్ర ఉన్నా తాగడానికి నీళ్లున్నాయా మీకు? సాగునీరు వచ్చిందా? గురురాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తోందా? కానీ తుంగభద్రలోని ఇసుకకు మాత్రం ఇక్కడి ఎమ్మెల్యే పెద్ద లీడర్ అయిపోయాడు. ఇసుక మాఫియా ఉందా, లేదా? ఇసుక దొంగిలించే బాల నాగిరెడ్డి ఒక్క పని చేశాడా? ఒక ఊరికైనా రోడ్డు వేశాడా, ఒక ఊరికైనా మంచి నీరు ఇచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చాడా? బడుగుజీవుల రక్తం తాగే దుర్మార్గులు ఈ బాల నాగిరెడ్డి, సాయిప్రతాపరెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే!
ఈసారి ఎన్నికల్లో గెలిచేది కూటమి అభ్యర్థులే. కూటమి వస్తేనే మంత్రాలయం మళ్లీ అభివృద్ధి చెందుతుంది. ఈ ముఖ్యమంత్రి ఒక సైకో. ఈ సైకోను నమ్ముకుని అందరూ మునిగిపోయారు. ప్రజలందరూ బాగుంటే నేను ఓటు అడగను... మీరందరూ బాగున్నారా? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల జీవితాల్లో ఎంతో కొంత మార్పు రావాలి కదా. వచ్చిందా మార్పు?
రాయలసీమలో 52 సీట్లలో గెలిపించారు... పాదయాత్రలో మోసాలు చేశాడు, అబద్ధాలు చెప్పాడు... నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు... మీరందరూ ఐస్ అయిపోయారు. ప్రజలది వెన్నలాంటి మనసు... అతడ కరడుగట్టిన ఉగ్రవాది. ఆ ఉగ్రవాది నాటకానికి నా ప్రజానీకం బలైపోయారు... అదే నా బాధ!
ఇతడికి నీటి విలువ తెలుసా? రైతులకు నీటి విలువ తెలుసు, నాకు నీటి విలువ తెలుసు... నీరు జీవితాలను మార్చుతుంది. సాగునీరు, తాగునీరు ఎక్కడుంటే అక్కడ ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. టెక్నాలజీ యుగంలో కూడా ఇక్కడ నీళ్లు లేవంటే గుండె తరుక్కుపోతోంది.
40 ఏళ్లు మీరు నన్ను ఆదరించారు. నా జీవితాశయం ఒకటే. ఆంధ్రప్రదేశ్ లో పేదరికం లేని సమాజాన్ని చూడాలి... అందుకోసం నేను కృషి చేస్తాను. సంపద సృష్టిస్తా... ఆదాయం పెంచుతా... ఆ ఆదాయాన్ని మీకు పంచుతా... చేపలు ఇవ్వడమే కాదు, చేపలు పట్టే విధానం కూడా నేర్పించి ఆ ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తా.
ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా... మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డలకు నాలుగు కార్యక్రమాలు ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500... ఏడాదికి రూ.18 వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు ఇస్తాం. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లల కోసం ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున అకౌంట్లలో వేస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.
ఈ నాలుగే కాదు... డ్వాక్రా సంఘాల వారికి కూడా హామీ ఇస్తున్నా... రూ.10 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తా" అని చంద్రబాబు వివరించారు.