ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... టాస్ గెలిచిన ఆర్సీబీ
- తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
- రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ × చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది.
రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఇక, తొలి మ్యాచ్ విషయానికొస్తే... గుజరాత్ టైటాన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
గత మ్యాచ్ లో సన్ రైజర్స్ పై సంచలన విజయం సాధించిన ఆర్సీబీ... అదే ఊపును నేడు గుజరాత్ టైటాన్స్ పైనా ప్రదర్శించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇటీవల ఫామ్ కోల్పోయి విరామం తీసుకున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ మళ్లీ ఆర్సీబీ జట్టులో చేరాడు.
గుజరాత్ టైటాన్స్ టోర్నీలో ఇప్పటిదాకా 9 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించి ఏడో స్థానంలో ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.