టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఆడే స్థానంపై మాజీ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు

  • కోహ్లీని ఓపెనర్‌గా ఆడిస్తే రింకూ సింగ్, శివమ్ దూబే వంటి ఫినిషర్లకు ఛాన్స్ దక్కుతుందన్న ఇర్ఫాన్ పఠాన్
  • అయితే లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం రోహిత్-జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తే బావుంటుందని అభిప్రాయం
  • జైస్వాల్ లెగ్ స్పిన్ కూడా వేయగలడన్న టీమిండియా మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టు ఎంపిక, తుది జట్టుపై చర్చ జరుగుతున్న వేళ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభిస్తే రింకూ సింగ్, శివమ్ దూబే వంటి పవర్ హిట్టర్లకు తుది జట్టులో స్థానం లభిస్తుందని అన్నాడు. అయితే ఈ సమీకరణంలో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లకు మాత్రమే పరిమితమవ్వాల్సి ఉంటుందని విశ్లేషించాడు. భారత ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఉండాలని పఠాన్ అభిప్రాయపడ్డారు. కుడిచేతి-ఎడమచేతి కాంబినేషన్ ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో జైస్వాల్  స్ట్రైక్ రేట్ 160కి పైగానే ఉందని ప్రస్తావించారు. ఇలాంటి పవర్ హిట్టర్ ఓపెనర్‌గా అవసరమని పేర్కొన్నాడు. 

మరోవైపు కోహ్లీ ఓపెనర్‌గా రావడం వల్ల కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయని పఠాన్ పేర్కొన్నాడు. విరాట్ ఇన్నింగ్స్ ఆరంభిస్తే తుది జట్టు ఒక నిర్దిష్ట రీతిలో ఉంటుందని, శివమ్ దూబేకి ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. రింకూ సింగ్‌కి కూడా ఛాన్స్ దక్కొచ్చని పేర్కొన్నాడు. అయితే విరాట్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తే అందుకు అవకాశం ఉండదని విశ్లేషించాడు. 

టాప్ సిక్స్ బౌలర్లలో లెఫ్ట్ హ్యాండర్లు ఎవరూ లేకపోవడంతో తుది జట్టులో జైస్వాల్‌కు అవకాశం ఇవ్వాలని, అతడు లెగ్-బ్రేక్‌ స్పిన్ వేయగలడని ప్రస్తావించాడు. జైస్వాల్ నెట్స్‌లో క్రమం తప్పకుండా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడని, ఆరవ బౌలర్‌గా అతడు అందుబాటులో ఉంటాడని పేర్కొన్నాడు. టాప్ సిక్స్ బ్యాటర్లలో బౌలింగ్ చేసేవారు ఎవరూ లేరని, ఇదే పెద్ద మైనస్‌గా కనిపిస్తోందని పఠాన్ విశ్లేషించాడు. స్టార్ స్పోర్ట్స్‌ ‘ప్రెస్ రూమ్ షో’లో మాట్లాడుతూ పఠాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.


More Telugu News