ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించిన ఇషాన్ కిషన్.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత

  • నిన్న ఢిల్లీ కేపిటల్స్‌తో మ్యాచ్
  • ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి పాల్పడిన ఆటగాడు
  • నేరాన్ని అంగీకరించిన ముంబై ఓపెనర్
ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత పడింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో నిన్న మధ్యాహ్నం ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. తన తప్పును ఇషాన్ అంగీకరించాడని, మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాను అంగీకరించినట్టు ఐపీఎల్ పేర్కొంది. లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్. దీనికి ఆటగాడు కట్టుబడి ఉండాల్సిందే. 

ఆర్టికల్ 2.2 అనేది క్రికెట్ పరికరాలు లేదంటే దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదంటే ఫిక్చర్లు, ఫిటింగ్‌ల దుర్వినియోగానికి సంబంధించినది. తనపై మోపిన అభియోగాలను ఇషాన్ అంగీకరించడంతో నిర్వాహకులు ఆ నేరం ఏంటన్న దానిని బయటపెట్టలేదు. నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీ నిర్దేశించిన 258 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 247 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.


More Telugu News