సుహాస్ నటనలో మట్టివాసన ఉంటుంది: సుకుమార్
- సుహాస్ హీరోగా రూపొందిన 'ప్రసన్నవదనం'
- ఫేస్ బ్లైండ్ నెస్ చుట్టూ తిరిగే కథ
- సినిమా బాగా వచ్చిందన్న సుకుమార్
- ఈ నెల 3వ తేదీన భారీ విడుదల
సుహాస్ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన 'ప్రసన్న వదనం' సినిమా, మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాతో దర్శకుడుగా అర్జున్ పరిచయమవుతున్నాడు. ఎదుటివారి ముఖాలను గుర్తించలేని హీరో, మూడు మర్డర్ కేసుల నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు హంతకుడు ఎవరు? అనేదే మిగతా కథ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొంతసేపటి క్రితం జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా సుకుమార్ హాజారయ్యాడు.
సుకుమార్ మాట్లాడుతూ .. 'పుష్ప' సినిమాలో జగదీశ్ పాత్రకి సుహాస్ ను తీసుకోవాలని అనుకున్నాను .. కానీ అప్పటికే అతను హీరోగా చేస్తున్నాడని తెలిసింది. నాకు నాని అంటే చాలా ఇష్టం .. నాని ఎలా ఎదుగుతూ వెళ్లాడో .. సుహాస్ కూడా అలా ఎదుగుతూ వెళతాడని నాకు అనిపిస్తోంది. నాని సహజ నటుడు అయితే .. సుహాస్ ని మట్టి నటుడు అనాలేమో. ఆయన నటన చాలా ఆర్గానిక్ గా .. సింపుల్ గా అనిపిస్తోంది" అని అన్నారు.
"అర్జున్ ఈ కథను చాలా బాగా హ్యాండిల్ చేశాడు .. నేను చూశాను .. ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను. తనకున్న బడ్జెట్ లో .. తనకున్న సమయంలో చాలా నీట్ గా ఈ సినిమాను చేస్తూ వెళ్లాడు. అతను ఇలా చేస్తాడని నాకు తెలుసు. ఈ సినిమాను చూసి అంతా సపోర్టు చేస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.