మెక్‌గుర్క్ విధ్వంసం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ.. అరుదైన ఘ‌న‌త‌!

  • 15 బంతుల్లో 8 బౌండ‌రీలు, 3 సిక్స‌ర్ల సాయంతో 52 ప‌రుగులు
  • ఓవ‌రాల్‌గా 27 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సుల‌తో 84 ప‌రుగులు బాదిన యువ బ్యాట‌ర్
  • టీ20 క్రికెట్‌లో 15 బంతుల లోపు రెండుసార్లు హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్న మూడో క్రికెట‌ర్‌గా అవ‌త‌ర‌ణ‌
  • అత‌ని కంటే ముందు ఈ ఫీట్ సాధించిన‌ సునీల్ న‌రైన్‌, ఆండ్రీ ర‌స్సెల్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ తో జ‌రుగుతున్న మ్యాచులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ యువ ఆట‌గాడు జేక్ ఫ్రేజ‌ర్-మెక్‌గుర్క్ విధ్వంసం సృష్టించాడు. ముంబై బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోస్తూ 15 బంతుల్లోనే అర్ధ శ‌క‌తం న‌మోదు చేశాడు. 8 బౌండ‌రీలు, 3 సిక్స‌ర్ల సాయంతో 52 ప‌రుగులు చేశాడు. ఓవ‌రాల్‌గా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న ఈ యువ బ్యాట‌ర్ 11 ఫోర్లు, 4 సిక్సుల‌తో 84 ప‌రుగులు బాదాడు. ఇక ఈ మ్యాచ్‌లో అర్ధ శ‌త‌కంతో చెల‌రేగిన ఫ్రేజ‌ర్‌-మెక్‌గుర్క్ ఓ అరుదైన రికార్డును న‌మోదు చేశాడు. 

టీ20 క్రికెట్‌లో 15 బంతుల లోపు రెండుసార్లు హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్న మూడో క్రికెట‌ర్‌గా నిలిచాడు. కాగా, ఇదే సీజ‌న్‌లో హైద‌రాబాద్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లోనూ ఫ్రేజ‌ర్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ బాదిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. అత‌ని కంటే ముందు ఈ ఫీట్‌ను విండీస్ ఆట‌గాళ్లు సునీల్ న‌రైన్‌, ఆండ్రీ ర‌స్సెల్ సాధించ‌డం జ‌రిగింది.


More Telugu News