బాబాయ్ అన్నీ వదులుకుని ప్రజల కోసం వచ్చారు... ఆయనను చూసి గర్విస్తున్నాం: వరుణ్ తేజ్
- పిఠాపురం వచ్చిన వరుణ్ తేజ్
- బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం
- మొన్న బాబాయ్ నామినేషన్ ర్యాలీ దద్దరిల్లిపోయిందని వ్యాఖ్య
జనసేనాని పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బాబాయ్ కి మద్దతుగా అబ్బాయి వరుణ్ తేజ్ రంగంలోకి దిగారు. ఈ మధ్యాహ్నం కుటుంబ సమేతంగా పిఠాపురంలోని పురుహూతికా అమ్మవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ ను మీడియా పలకరించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా బాబాయ్ ఇక్కడ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు... ఆయనకు చాలా మంచి విజయం దక్కాలి అని కోరుకుంటున్నామని తెలిపారు.
"ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతో బాబాయ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఓ కుటుంబంగా మేమంతా అండగా నిలిచేందుకు ఇవాళ పిఠాపురం వచ్చాం. ఈ క్రమంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడి ఆలయానికి వచ్చాం. ఇంట్లో వాళ్ల కోసం పనిచేయడం కాకుండా, ఇలా బయటికి వచ్చి ప్రజలే తన కుటుంబం అని భావించే వ్యక్తి పవన్ కల్యాణ్ గారు. మా బాబాయ్ ఎంతో డబ్బు ఉన్నా, అవన్నీ వదిలేసి ప్రజల కోసం వచ్చారు. ఆయనను చూసి మేం చాలా గర్వపడుతుంటాం. మొన్న బాబాయ్ నామినేషన్ ర్యాలీ చూశాను... దద్దరిల్లిపోయింది" అంటూ వరుణ్ తేజ్ వివరించారు.