గాడ్జిల్లా స్విమ్మింగ్‌ చేస్తుంటే.. గాలాపగోస్‌ దీవుల్లో తీసిన వైరల్‌ వీడియో ఇదిగో!

  • గాలాపగోస్ దీవుల్లో వీడియో తీసిన ఓ డైవర్
  • నీటిలో ఉండే ‘ఇగ్వానా’గా గుర్తింపు
  • అచ్చం గాడ్జిల్లాలా ఉందంటూ నెటిజన్ల కామెంట్లు
గాడ్జిల్లా సినిమాలంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. భారీ ఆకారంతో భూమి పొరల్లో ఉంటూ.. అవసరమైనప్పుడు బయటికి వచ్చి భూమిని రక్షిస్తూ ఉంటుందనేది ఆ సినిమాల్లోని పాయింట్. అలాంటి ఓ గాడ్జిల్లా మీ ముందే స్విమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుంది? అయితే గాడ్జిల్లా కాదుగానీ.. అలాగే ఉండే ‘ఇగ్వానా’ నీటిలో ఈదుతుండగా తీసిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

గాలాపగోస్ దీవుల్లో..
పసిఫిక్ మహా సముద్రంలో ఉండే గాలాపగోస్ దీవులు జీవ వైవిధ్యానికి ప్రతీక. అక్కడ నీటి బల్లుల జాతికి చెందిన ఇగ్వానాలు ఉంటాయి. అవి అచ్చం గాడ్జిల్లాలను పోలినట్టుగా ఉండటం గమనార్హం. నీళ్లలో 30 అడుగుల లోతు వరకు వెళ్లగలిగే సామర్థ్యం వీటి సొంతం. కొంతకాలం కిందట ఓ డైవర్ దీనిని దగ్గరగా వీడియో తీశారు. అది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

మరీ భయమేమీ వద్దు..
  • మెరైన్ ఇగ్వానాలు చూడటానికి కాస్త భయపెట్టేలా ఉన్నా.. హానికరమేమీ కాదట. ఎందుకంటే అవి వెజిటేరియన్లని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
  • సముద్రం అడుగున, నీటిపైన పెరిగే ఆల్గేను తిని బతికేస్తాయట. నీటి అడుగున మరీ ఎక్కువ సేపు ఉండవట. తరచూ నీటి పైకి వచ్చి తేలియాడుతూ.. ఎండ నుంచి వేడిని పొందుతాయట.
  • నిజమైన గాడ్జిల్లా తిరుగుతున్నట్టే ఉందంటూ కొందరు.. ఈ వీడియో చాలా బాగుంటుందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
  • ఇంకొందరేమో నేనైతే నీటిలో అది కనిపిస్తే.. దగ్గరికి కూడా వెళ్లను బాబోయ్ అంటున్నారు.


More Telugu News