రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 లకు.. అమ్మ ఒడి రూ. 17 వేలకు పెంపు.. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్!

  • వైసీపీ మేనిఫెస్టోలోని 9 ప్రధాన హామీలు
  • మేనిఫెస్టో విడుదల చేస్తూ ఏపీ సీఎం జగన్ ప్రసంగం
  • ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల వివరణ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ శనివారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేయబోయే కార్యక్రమాలను, చేపట్టబోయే సంక్షేమ పథకాల జాబితాను వెల్లడించారు. కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ జగన్ ప్రసంగించారు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రధాన హామీలను సంక్షిప్తంగా మీడియా లైవ్ లో జగన్ ప్రజలకు వివరించారు.

తొమ్మిది ప్రధాన హామీలు..
  • పెన్షన్ రూ.3,500 (రెండు విడతల్లో) పెంపు
  • వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిస్తున్న మొత్తాన్ని 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంపు 
  • అమ్మ ఒడి పథకం కింద అందిస్తున్న మొత్తాన్ని 2 వేలు పెంచి రూ. 17 వేలు అందజేస్తామని హామీ
  • వైస్సార్‌ రైతు భరోసా రూ.16 వేలు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు
  • వైఎస్సార్‌ కాపు నేస్తం లబ్దిదారులకు ఇప్పుడిస్తున్న రూ.60 వేలను నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలకు పెంచుతామని వెల్లడి
  • ఈబీసీ నేస్తం కింద ఇప్పుడిస్తున్న రూ. 45 వేల మొత్తాన్ని రూ.1.05 వేలకు పెంపు (నాలుగు దఫాల్లో)
  • వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం.. అర్హులైన పేదవాళ్లకు ఇళ్లు
  • వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా, విద్యాకానుక పథకాల కొనసాగింపు
  • లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా


More Telugu News