బీజేపీ నేతల పదేళ్ల అబద్ధాల తర్వాత ఇదీ పరిస్థితి.. అఖిలేశ్ యాదవ్ షేర్ చేసిన వైరల్ వీడియో ఇదిగో!
- తొలి రెండు విడతల్లో బీజేపీకి ఓటర్లు దూరమయ్యారన్న అఖిలేశ్ యాదవ్
- మున్ముందు ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా ఉండబోతోందని వ్యాఖ్య
- ఆ పార్టీకి బూత్ ఏజెంట్లు కూడా దొరకడం లేదని ఎద్దేవా
తొలి విడత ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీచిందన్న వార్తలు వినిపించాయి. నిన్న జరిగిన రెండో విడత ఎన్నికల తర్వాత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి రెండు విడతల్లో ఓటర్లను బీజేపీ ఆకర్షించలేకపోయిందని, మున్ముందు కూడా ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందంటూ ఎక్స్ ద్వారా జోస్యం చెప్పారు. అంతేకాదు, ఆ పార్టీకి పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు.
నిన్న 13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ బాగా బలహీనపడిందని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ఓ వార్తా చానల్ రిపోర్టర్ బీజేపీ బూత్ ఏజెంట్‌తో మాట్లాడుతున్న వీడియో క్లిప్‌ను అఖిలేశ్ షేర్ చేశారు. ‘బీజేపీ నేతల పదేళ్ల అబద్ధాల తర్వాత.. ఆ పార్టీ బూత్ ఏజెంట్ పరిస్థితి ఇదీ’ అని ఆ వీడియోకు క్యాప్షన్ తగిలించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటి కారణంగానే ప్రజలకు బీజేపీకి ఓటేయలేదని విమర్శించారు.