ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు జగన్?: చంద్రబాబు నాయుడు
- 'ఎక్స్' వేదికగా సీఎం జగన్‌పై చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు
- ఈసారి మేనిఫెస్టో విషయమై వైసీపీ అధినేతను నిలదీసిన చంద్రబాబు
- 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల సమయంలో జగన్ చెప్పిన మాటలను గుర్తు చేసిన వైనం
- మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటూ ప్రగల్భాలు పలికారంటూ ఫైర్
వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి 'ఎక్స్' (ట్విటర్) వేదికగా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈసారి మేనిఫెస్టో విషయమై జగన్‌ను చంద్రబాబు నిలదీశారు. 2019 ఎన్నికల సమయంలో మేనిఫెస్టో విడుదల సమయంలో వైసీపీ అధినేత చెప్పిన మాటలను గుర్తు చేశారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని జగన్ అన్నారు. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా ఆయనకు గౌరవం ఉంటే.. 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడని చంద్రబాబు దుయ్యబట్టారు. అలాగే మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావంటూ ధ్వజమెత్తారు.