ఆ జోక్ తారుమారయింది.. ఇప్పుడు భారతీయులకే అమెరికాలో సీఈఓ ఛాన్స్: రాయబారి ఎరిక్ గార్సెట్టి
- భారతీయులను ఉద్దేశిస్తూ భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
- అమెరికాలో భారతీయులు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారంటూ ప్రశంసలు
- భారతీయ విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి
- ఇండియన్ విద్యార్థులు యూఎస్ సంస్కృతిని సుసంపన్నం చేస్తారన్న రాయబారి
అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు అన్ని రంగాలలో దూసుకెళ్తున్నారు. వ్యాపారం, రాజకీయం, ఉపాధి, ఉద్యోగం ఇలా అన్నింటా కూడా మనోళ్లు తమ మార్క్ చూపిస్తున్నారు. అక్కడి బడా కంపెనీలలో చాలా వాటికి మనోళ్లే బాస్. ఈ నేపథ్యంలోనే భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తాజాగా భారతీయులను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో భారతీయులు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని ప్రశంసించారు.
ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయబారి మాట్లాడుతూ.. "గతంలో మీరు ఇండియన్స్ అయితే అమెరికాలో సీఈఓ కాలేరనే జోక్ ఉండేది. ఇప్పుడీ జోక్ తారుమారయింది. ప్రస్తుతం భారతీయులు కాకపోతే సీఈఓ అవ్వలేరనేంత ప్రభావం ఉంది. ఫార్చ్యూన్-500 కంపెనీల్లోని ప్రతి 10 మంది సీఈఓల్లో ఒకరు ఇండియనే. గూగుల్, మైక్రోసాఫ్ట్, స్టార్‌బక్స్ ఇలా ప్రతి పెద్ద సంస్థ భారతీయుల చేతుల్లోనే ఉంది. అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది" అని పేర్కొన్నారు.
భారతీయ విద్యార్థుల భద్రతకు చర్యలు
అలాగే భారత విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. "మేము ప్రతి విద్యార్థి శ్రేయస్సు కోసం చాలా శ్రద్ధ వహిస్తున్నాం. ముఖ్యంగా యూఎస్‌కి వచ్చే మా భారతీయ విద్యార్థుల శ్రేయస్సుకై చాలా తపిస్తున్నాం. మానసిక, ఆరోగ్య సంరక్షణ అయినా, శారీరక భద్రత అయినా, అద్భుతమైన వనరులు ఉన్నాయా అనే సమాచారమంతా వారి వద్ద ఉందని మేము నిర్ధారించుకోవాలనుకుంటున్నాం. మా కాలేజీ క్యాంపస్‌లన్నింటిలో భారతీయ విద్యార్థులు యుఎస్‌కి రాకముందే వారి గురించి తెలియజేయాలనుకుంటున్నాం" అని గార్సెట్టి చెప్పారు.
ఇండియన్ విద్యార్థులు యూఎస్ సంస్కృతిని సుసంపన్నం చేస్తారు: రాయబారి
భారతీయ విద్యార్థులు అమెరికా సంస్కృతిని సుసంపన్నం చేస్తారంటూ రాయబారి ఇండియన్ విద్యార్థుల పట్ల తనకున్న ప్రేమను చాటారు. "మేము అమెరికాలోని భారతీయ విద్యార్థులను ఎంతో ప్రేమిస్తున్నాం. వారు మా క్యాంపస్‌లను మెరుగుపరచడంతో పాటు యూఎస్ సంస్కృతిని సుసంపన్నం చేస్తారు. వారి జీవితాలను సుసంపన్నం చేసే, వారి కలలను సాకారం చేసుకునే ఉత్తమమైన మార్గాన్ని వారు కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాము" అని రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పుకొచ్చారు.