'శబరి' కథ సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టేస్తుంది: వరలక్ష్మి శరత్ కుమార్
- నాయిక ప్రధానంగా సాగే కథతో 'శబరి'
- టైటిల్ రోల్ ను పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్
- సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- మే 3వ తేదీన థియేటర్లకు వస్తున్న సినిమా
వరలక్ష్మి శరత్ కుమార్ .. నిన్నమొన్నటి వరకూ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలతో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక నాయిక ప్రధానమైన కథలను సైతం అంగీకరిస్తూ వెళుతున్నారు. అలా ఆమె చేసిన 'శబరి' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మహేంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమాకి అనిల్ దర్శకత్వం వహించాడు. మే 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ .. "ఇది తల్లీ కూతుళ్ల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ. జోనర్ పరంగా చెప్పాలంటే ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. ఒక సింగిల్ మదర్ .. తన కూతురుకి ఎలాంటి లోటు తెలియకుండా పెంచాలని అనుకుంటుంది. అలాంటి సమయంలో తన బిడ్డకి ఆపద తలపెట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే, ఆమె ఎలా రియాక్ట్ అవుతుందనేదే ఈ సినిమా" అని అన్నారు.
" కథను ఎంతవరకూ చెప్పాలో .. ఎక్కడి వరకూ చెప్పాలో అంతవరకు మాత్రమే తెరపై కనిపిస్తుంది. ఖర్చు పెట్టాం కదా అని సాగదీయడానికి ట్రై చేయలేదు. అసలు కథ వెంటనే మొదలైపోతుంది .. ఎక్కడా ల్యాగ్ అనేది ఉండదు. ఓ మూడు అంశాలు చాలా కీలకమైన సందర్భాల్లో తెరపైకి వస్తాయి .. అవే కథను మలుపు తిప్పుతాయి. రీసీ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టేస్తుంది" అని చెప్పారు.