మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి బయటకు తీసిన పసికందు మృతి
- వారం క్రితం గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
- తండ్రి, తల్లి, నాలుగేళ్ల వారి కుమార్తె మృతి
- అప్పటికే మహిళ నిండు గర్భిణి
- మృతదేహం నుంచి అతికష్టం మీద శిశువు వెలికితీత
- ఇంక్యుబేటర్‌లో ఉంచి సంరక్షణ.. నిన్న కన్నుమూత
పాలస్తీనాపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన గగనతల దాడిలో మృతి చెందిన మహిళ గర్భం నుంచి సురక్షితంగా బయటకు తీసిన శిశువు ప్రాణాలు కోల్పోయింది. గాజాపై క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ గతవారం రఫా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దంపతులతోపాటు వారి నాలుగేళ్ల కుమార్తె కూడా మరణించింది.
అప్పటికే మహిళ సబ్రీన్ అల్ సకానీ నిండు గర్భిణి కావడంతో వెంటనే ఆమె మృతదేహాన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతికష్టం మీద మహిళ గర్భంలోని శిశువును సురక్షితంగా బయటకు తీశారు. అప్పటి నుంచి ఆ పసికందును ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. తాజాగా, నిన్న ఆ శిశువు మృతి చెందినట్టు వారి బంధువు ఒకరు తెలిపారు.