రేపటి నుంచి ప్రచారాన్ని హోరెత్తించనున్న జగన్.. షెడ్యూల్ ఇదిగో
- ప్రతిరోజు మూడు బహిరంగసభల్లో పాల్గొననున్న జగన్
- రేపు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో సభలు
- రేపటి నుంచి మే 1 వరకు షెడ్యూల్ ఖరారు
ఇప్పటి వరకు మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న తరుణంలో ఆయన ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. రేపటి నుంచి సుడిగాలి పర్యటన చేయనున్నారు. రోజుకు మూడు బహిరంగ సభల్లో పాల్గొనేలా జగన్ షెడ్యూల్ ఖరారయింది.
రేపు ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో నిర్వహించే సభల్లో జగన్ పాల్గొంటారు. 29వ తేదీన ఉదయం చోడవరం, మధ్యాహ్నం పి.గన్నవరం, సాయంత్రం పొన్నూరులో నిర్వహించే సభలకు హాజరవుతారు. 30న ఉదయం కొండేపి, మధ్యాహ్నం మైదుకూరు, సాయంత్రం పీలేరు సభల్లో ప్రసంగిస్తారు. మే 1న ఉదయం బొబ్బిలి, మధ్యాహ్నం పాయకరావుపేట, సాయంత్రం ఏలూరు సభలకు హాజరవుతారు. జగన్ సభలకు సంబంధించి అన్నిచోట్ల శర వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు, ఈరోజు వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది.